కుత్బుల్లాపూర్, జూలై 15: (నవజ్యోతి ప్రతినిధి)ప్రజా సమస్యల పరిష్కారంలో నవజ్యోతి దినపత్రిక మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో, శ్రీకృష్ణ హోటల్ ఎదురుగా రోజుల తరబడి పొంగిపొర్లుతున్న డ్రైనేజీ కారణంగా స్కూల్ విద్యార్థులు, మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని “మురుగు పారుతుంటే… పాలన ఎక్కడ?”అనే శీర్షికతో నవజ్యోతి ప్రచురించింది.
ఈ కథనంపై స్పందించిన సంబంధిత దుండిగల్ సర్కిల్ అధికారులు వెంటనే సమస్యను పరిశీలించి, డ్రైనేజీ నీటి నిల్వలను తొలగించి శాశ్వత పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు, వాహనదారులకు ఊరట నిచ్చింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పందింపజేసిన నవజ్యోతి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి వేదికగా నిలుస్తున్న నవజ్యోతి, ప్రజల గొంతుకగా తన పాత్రను మరోసారి సమర్థంగా నిరూపించుకుంది.

