📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeతెలంగాణమెదక్ అభివృద్ధి ఏ నా లక్ష్యం : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

మెదక్ అభివృద్ధి ఏ నా లక్ష్యం : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

ఉమ్మడి మెదక్ ( నవజ్యోతి ప్రతినిధి )జూలై 14

మెదక్ నియోజకవర్గ అభివృద్దే నా లక్ష్యం

అభివృద్ధిలో ఆగ్రగామిగా మెదక్ నియోజకవర్గన్నీ తీర్చిదిద్దుతామెదక్ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావురెండు కోట్ల తొంబైముడు లక్షల తో మెదక్ అభివృధి పనులు.మెదక్ అభివృద్ధికి మరో ముందడుగు.. పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ శంకుస్థాపనప్రతి వార్డుకు సమాన అభివృద్ధే లక్ష్యం.. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్మెదక్ పట్టణ రూపురేఖలు మారుతున్నాయి.. కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలురోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులతో ఆదర్శ పట్టణంగా మెదక్‌ను తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే
మెదక్మెదక్ పట్టణ సమగ్రాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పట్టణంలోని 31, 30, 23, 22, 20, 16, 17, 18, 19, 21, 28 వార్డుల్లో సీసీ రోడ్లు మరియు మురికి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి అభివృద్ధి కార్యక్రమాలకు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ,.. “మెదక్ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి అందించడం నా బాధ్యత. పట్టణంలోని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం నా లక్ష్యం. రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అన్ని రంగాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు.
గతంలో ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.
మెదక్ పట్టణాన్ని ఆధునిక మౌలిక వసతులతో కూడిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కోట్ల రూపాయల నిధులను తీసుకువస్తున్నామని తెలిపారు. అభివృద్ధి అనేది కేవలం హామీలతో కాకుండా పనులతో కనిపించాలనే ఉద్దేశంతో నిరంతరం ప్రజల్లో ఉంటూ సమస్యలను స్వయంగా పరిశీలించి వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు.
“ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే నా ధ్యేయం. ఏ వార్డు వెనుకబడకుండా ప్రతి ప్రాంతంలో సమానంగా అభివృద్ధి జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభించి మెదక్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అధికారులు, కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా పనుల నాణ్యతను పరిశీలిస్తూ తమ సూచనలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!