📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిటీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామకంపై ఎం.ఏ. మతీన్ కృతజ్ఞతలు

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామకంపై ఎం.ఏ. మతీన్ కృతజ్ఞతలు

సంగారెడ్డి, జూలై 10 (నవజ్యోతి ప్రతినిది):

టెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఎం.ఏ. మతీన్ తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా కార్యవర్గ సభ్యులకు, సీనియర్ జర్నలిస్టులకు, సహచర పాత్రికేయులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవి తనకు గౌరవంతో పాటు మరింత బాధ్యతను కూడా కల్పించిందని పేర్కొన్నారు. జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తానని మతీన్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. తనపై చూపిన విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరి సహకారం, సూచనలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ అందించాలని ఎం.ఏ. మతీన్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!