కుత్బుల్లాపూర్, జులై 8 (నవజ్యోతి ప్రతినిధి) :
బౌరంపేట్ డివిజన్‌లోని సింహపురి కాలనీలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించిన ఆలయ విగ్రహాలను అర్ధరాత్రి సమయంలో తొలగించడంపై కాలనీవాసులు, బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. విగ్రహాలను యథాస్థానంలో పునఃప్రతిష్ఠ చేయాలని డిమాండ్ చేస్తూ మియాపూర్ హైవేపై రోడ్డుదిగ్బంధం నిర్వహించారు. నిరసనకు బీజేపీ డివిజన్ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి సహా పలువురు నాయకులు మద్దతు తెలిపారు.ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం, అర్ధరాత్రి విగ్రహాలను తొలగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని వారు ఆరోపించారు. అనంతరం నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విగ్రహాలను అదే చోట తిరిగి ప్రతిష్ఠించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.

