నాలా (NALA) కన్వర్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ పేరుతో లంచం డిమాండ్ – కార్యాలయంలోనే పట్టుకున్న ఏసీబీ అధికారులు
సిద్దిపేట జూలై 6 ( నవజ్యోతి ప్రతినిధి ) :
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ఏసీబీ వలలో చిక్కారు. నాగపురి గ్రామానికి సంబంధించిన 11 నాలా (NALA) కన్వర్షన్ దరఖాస్తుల ప్రాసెసింగ్ కోసం ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా సోమవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అధికారి వద్ద నుంచి రూ.70 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయనను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
కేసు దర్యాప్తులో ఉందని, ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ తెలిపింది.లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదుల కోసం ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

