రామాయంపేట జూలై 3 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్)
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఓటరు వివరాలను పారదర్శకంగా, ఖచ్చితంగా నమోదు చేసే లక్ష్యంతో బీఎల్వోలు డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్ఐ గోపి పనులను పరిశీలించి, ప్రతి ఫారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎలాంటి సాంకేతిక లేదా సమాచార లోపాలు లేకుండా నమోదు చేయాలని సూచించారు. అలాగే నిర్ణీత గడువులోపు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఎల్వోలకు దిశానిర్దేశం చేశారు
.

