భిక్కనూరు, జూలై 2 (నవజ్యోతి ప్రతినిధి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి నుంచి కాచాపూర్ వరకు సుమారు 8.5 కిలోమీటర్ల మేర రూ.9.91 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫీడర్ ఛానల్ పూడికతీత పనులను గురువారం ప్రారంభించారు. ఈ పనుల ద్వారా సాగునీటి సరఫరా మెరుగుపడి రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు సకాలంలో సాగునీరు అందేలా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాచాపూర్ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్, బిక్కనూర్ సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్, రామేశ్వర్ పల్లి సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్లు బైండ్ల దశరథం, గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ గాల్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింగరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగన్నగారి నరేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

