📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper

వైన్స్‌ మూసివేత.. గల్లీల్లో మద్యం జోరు.. నవజ్యోతి కెమెరాకు చిక్కిన దృశ్యాలు

కుత్బుల్లాపూర్‌, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): బోనాల సందర్భంగా వైన్స్‌ దుకాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌, రామ్‌రెడ్డినగర్‌లో గల్లీల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

సుభాష్‌నగర్‌లోని ఓ షెడ్‌లో పలువురు మద్యం సేవిస్తున్న దృశ్యాలు, పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు, రాత్రివేళ గుమిగూడిన వ్యక్తులు నవజ్యోతి కెమెరాకు చిక్కారు. కిరాణా దుకాణం వద్ద కూడా మద్యం విక్రయాలకు సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు కనిపించాయి.

 

వైన్స్‌ బంద్‌.. మద్యం ఎలా వస్తోంది?

వైన్స్‌ మూసివేసిన సమయంలో మద్యం బాటిళ్లు గల్లీల్లోకి ఎలా చేరుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బెల్ట్‌ షాపుల పేరుతో అనధికార విక్రయాలు జరుగుతున్నాయా? మద్యం సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోందన్నదానిపై ఎక్సైజ్‌ అధికారులు దృష్టి సారించాలి.

 

 

నిఘా పెంచాలి

సుభాష్‌నగర్‌, రామ్‌రెడ్డినగర్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి మద్యం నిల్వలు, విక్రయాలపై విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆంక్షల సమయంలో అనధికార విక్రయాలు జరుగుతున్నాయా? వాటి వెనుక ఎవరున్నారన్నది అధికారులు తేల్చాల్సి ఉంది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!