ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్ ముదిరాజ్‌కు ఎంపీ రఘునందన్‌రావు సన్మానం
మనోహరాబాద్, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):
బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా మనోహరాబాద్ మండలం ధర్మరాజ్‌పల్లికి చెందిన భాషబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ ఎన్నికైన సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆయనను ఘనంగా సన్మానించారు. పార్టీ అధిష్ఠానం చంద్రశేఖర్ ముదిరాజ్‌కు అప్పగించిన బాధ్యతలు మనోహరాబాద్ మండల బీజేపీ శ్రేణులకు గర్వకారణమని ఎంపీ అన్నారు.
ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి, బీసీ సామాజిక వర్గాల సంక్షేమం కోసం చంద్రశేఖర్ ముదిరాజ్ అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరీ శంకర్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, రాంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉసిరికపల్లి రాజు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఓబీసీ మోర్చా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని చంద్రశేఖర్ ముదిరాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

