📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజాస్వామ్య పరిరక్షణలో యువజన కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించాలి !

ప్రజాస్వామ్య పరిరక్షణలో యువజన కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించాలి !

యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..

మిర్యాలగూడ, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని రాజీవ్‌ చౌక్‌ వద్ద ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటేష్‌తో కలిసి జెండాను ఆవిష్కరించారు.

దేశ భవిష్యత్తులో యువతదే కీలక పాత్ర

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్ర కీలకమన్నారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలు, ప్రజాస్వామ్య విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవా రంగాల్లో అవకాశాల కోసం కృషి చేయాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, యువత అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు భాగస్వాములు కావాలని సూచించారు.

పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు

కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్‌ హాజరుద్దీన్‌, కాంగ్రెస్‌ నాయకులు చిలుకూరి బాలకృష్ణ, నూకల వేణుగోపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మోయిజ్‌, కోడిరెక్క ఇంద్రకుమార్‌, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!