సంగారెడ్డి, ఆగస్టు 9 (నవజ్యోతి):
– 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి సభ.. విజయవంతంపై సమావేశంలో చర్చ… సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన 282 మంది బూత్ స్థాయి ఏజెంట్లతో కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గారెడ్డి, నిర్మల సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మల్కాపూర్‌లోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.
సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఏటీఎంసీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, బ్లాక్ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆమె కోరారు. ప్రతి బూత్‌కు సంబంధించిన బూత్ స్థాయి ఏజెంట్ తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
ఈ నెల 15న సంగారెడ్డి పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే సభ నేపథ్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోటి ఐదు లక్షల రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమానికి సంబంధించిన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యవేక్షణలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని నిర్మల జగ్గారెడ్డి కోరారు.

