తెలంగాణ ఆకాంక్షకు పార్లమెంట్‌లో బలమైన గొంతుకగా నిలిచారు: సాధినేని శ్రీనివాసరావు
మిర్యాలగూడ, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ చిన్నమ్మగా ప్రజల ఆదరణ పొందిన మాజీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ 7వ వర్ధంతిని పురస్కరించుకుని మిర్యాలగూడ పట్టణంలోని బీజేపీ తొలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు సాధినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్‌లో తన వాగ్ధాటి, నిబద్ధతతో దేశవ్యాప్తంగా తెలంగాణ వాదానికి బలమైన మద్దతు కూడగట్టిన గొప్ప నాయకురాలు సుష్మా స్వరాజ్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఆమె చేసిన ప్రసంగాలు ప్రజల్లో ధైర్యాన్ని నింపాయని, రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమె అందించిన సహకారం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
తెలంగాణ కోసం ఇకపై ఒక్క విద్యార్థి కూడా ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదని పార్లమెంట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతి తెలంగాణవాసి హృదయంలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఆమె చేసిన సేవలను ఈ నేల ఎన్నటికీ మరువదని, ఆమె సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో తొలి పట్టణ అధ్యక్షుడు బంటుగిరి, ప్రధాన కార్యదర్శి కొంగరి వెంకటరమణ, ఉపాధ్యక్షులు చిలుకూరి వెంకటేశ్వర్లు, మోదాల అశోక్, మహిళా మోర్చా అధ్యక్షురాలు గోనే కలితా రెడ్డి, నక్క రవి, మునగాల శివ, సీనియర్ నాయకులు రేపాల పురుషోత్తం రెడ్డి, తల్లం అశోక్, చిలుకూరి శామ్, నాగుబండి విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు వెలుగు నాగరాజు, మంచ శివ, పోల వెంకటేశ్వర్లు, మేడల రవి, మేకల నందు, పులి శ్రీను, వసంత్, లింగం సైదులు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

