📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భిక్కనూరులో రేపు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం: ఎస్‌హెచ్‌ఓ అనిల్

భిక్కనూరులో రేపు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం: ఎస్‌హెచ్‌ఓ అనిల్

ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొననున్న కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, సిబ్బంది హాజరుకావాలని పిలుపు

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భిక్కనూరులో రేపు (ఆగస్టు 5) ప్రత్యేక సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భిక్కనూరు ఎస్‌హెచ్‌ఓ ఎస్. అనిల్ తెలిపారు.

ఉదయం 9:30 గంటలకు భిక్కనూరులోని పద్మశాలి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాల నుంచి ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

అందరూ పాల్గొనాలి

గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఐకేపీ సిబ్బంది తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఎస్‌హెచ్‌ఓ అనిల్ కోరారు. కార్యక్రమంలో పొందిన సమాచారాన్ని గ్రామ ప్రజలకు చేరవేసి సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని సూచించారు.

 

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!