📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బస్వాపూర్ వాసి 59వ సారి రక్తదానం !

బస్వాపూర్ వాసి 59వ సారి రక్తదానం !

 

కిడ్నీ మార్పిడి పేషెంట్‌కు అత్యవసర సమయంలో అండగా నిలిచిన శ్రీనివాస్…

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన వి. రమేష్‌కు కిడ్నీ మార్పిడి చికిత్సలో భాగంగా అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడగా, అదే గ్రామానికి చెందిన కమ్మరి శ్రీనివాస్ వెంటనే స్పందించి హైదరాబాద్‌కు వెళ్లి రక్తదానం చేశారు. ఇది ఆయన చేసిన 59వ రక్తదానం కావడం విశేషం.

అత్యవసర సమయంలో స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి రక్తం అందించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు శ్రీనివాస్ సేవలను అభినందించారు.

రక్తదానంపై అవగాహన అవసరం

జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ కమ్మరి శ్రీనివాస్‌ను అభినందించారు. ఒక యూనిట్ రక్తం ఒక ప్రాణాన్ని కాపాడగలదని, మరింత మంది యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!