📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyరైతులు, గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ...

రైతులు, గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి …

ట్రాన్స్‌ఫార్మర్ చోరీల నివారణకు భిక్కనూరు పోలీసుల విజ్ఞప్తి

భిక్కనూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇటీవల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి కాయిల్స్ వరుసగా చోరీకి గురవుతున్న నేపథ్యంలో రైతులు, గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భిక్నూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాన్స్‌ఫార్మర్లకు యాంటీ థెఫ్ట్ బోల్ట్‌లు వెల్డింగ్ చేయించుకుంటే దొంగతనాలను గణనీయంగా అరికట్టే అవకాశం ఉంటుందని సూచించారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో రైతులు తమ వ్యవసాయ పొలాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు. పగలు లేదా రాత్రి వేళల్లో ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 / 112కు సమాచారం అందించాలని తెలిపారు.

ప్రజల సహకారంతో ఇటువంటి ట్రాన్స్‌ఫార్మర్ చోరీలను అరికట్టడంతో పాటు నిందితులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని భిక్కనూరు ఎస్సై ఎస్. అనిల్ పేర్కొన్నారు. గ్రామాల్లో అప్రమత్తత పెంచడం ద్వారా రైతుల ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన సూచించారు.

పోలీసుల సూచనలు

  • విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు యాంటీ థెఫ్ట్ బోల్ట్‌లు వెల్డింగ్ చేయించుకోవాలి.
  • రాత్రి వేళల్లో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిఘా ఉంచాలి.
  • అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలి.
  • ట్రాన్స్‌ఫార్మర్ చోరీల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలి.
© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి. 
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!