బిక్కనూరు, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి):
మెదక్ జిల్లా తూప్రాన్‌లో నిర్వహించిన విద్యుత్ ఉద్యోగుల క్రికెట్ టోర్నీలో బిక్కనూరుకు చెందిన
లింబాద్రి ప్రతిభ చాటారు. విద్యుత్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే
ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా కొనసాగుతున్న ఆయన.. క్రీడలపై ఆసక్తితో క్రికెట్‌లోనూ రాణిస్తున్నారు.
లింబాద్రికి శ్రీరాం వెంకటేశ్ సన్మానం
ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీరాం వెంకటేశ్ లింబాద్రిని శాలువాతో సత్కరించి
అభినందించారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఫొటోగ్రఫీ, క్రీడారంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తున్న
లింబాద్రి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని వెంకటేశ్ అన్నారు.
ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు
ప్రోత్సాహం అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
ప్రోత్సాహం అభినందనీయం
క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వెంకటేశ్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని లింబాద్రి అన్నారు.
యువతకు ఆయన అందిస్తున్న ప్రోత్సాహం మరింత మందికి స్ఫూర్తినిస్తుందని
పేర్కొన్నారు.

