బోనాల వేడుకల్లో రాష్ట్ర నాయకులు చిట్కూల మహిపాల్ రెడ్డి సందడి ….
మనోహరబాద్,ఆగస్టు 16: (నవజ్యోతి ప్రతినిధి నవీన్ )
శ్రావణ బోనాల సందర్భంగా మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం గౌతొజీగూడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన పోచమ్మ, ఎల్లమ్మ అమ్మవార్లకు పూజా కార్యక్రమలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించరు,ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్కూల మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రామ సర్పంచ్ నాగరాజు తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులతో కలిసి బోనం సమర్పణ
అమ్మవారిని దర్శించుకున్న మహిపాల్ రెడ్డి భక్తులతో కలిసి బోనం సమర్పించారు. అనంతరం ప్రసాదం స్వీకరించి, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు.
పండుగ వాతావరణం
బోనాల సందర్భంగా గ్రామంలోనీ ప్రజలు, బందువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పిస్తూ అమ్మవారిని కొలిచిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. స్థానిక ప్రజలతో కలిసి మహిపాల్ రెడ్డి వేడుకల్లో పాల్గొని వారిని ప్రేమతో ఆప్యాయంగా పలకరించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పాల్గొన్న నాయకులు
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పర్శబోయిన నాగరాజ్, ఉప సర్పంచ్ ఎర్ర నాగరాజు, పాలవర్గం సభ్యులు, గ్రామ పెద్దలు,నాయకులు జావీద్ పాషా,శశిభూషన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

