📄 ePaper
Wednesday, September 30, 2026
📄 ePaper
HomeతెలంగాణGHMCమల్లారెడ్డి నగర్‌లో టౌన్ ప్లానింగ్ మెరుపు చర్యలు

మల్లారెడ్డి నగర్‌లో టౌన్ ప్లానింగ్ మెరుపు చర్యలు

కుత్బుల్లాపూర్, జూలై 19: (నవజ్యోతి ప్రతినిధి)గాజులరామారం సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ శాఖ మరోసారి ఉక్కుపాదం మోపింది. మల్లారెడ్డి నగర్ ఫేస్ -2లో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనంపై శనివారం భారీ డెమోలేషన్ నిర్వహించింది. డిప్యూటీ కమిషనర్ వెంకట రాములు ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు గ్యాస్ కట్టర్లతో స్లాబ్‌లను కట్ చేసి అక్రమ నిర్మాణ భాగాలను తొలగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ చర్యలు పూర్తయ్యాయి.

*నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్ష లేదు*

అనుమతులు పొందిన ప్లాన్‌కు భిన్నంగా నిర్మాణాలు చేపట్టే వారిపై రాజీ లేకుండా చర్యలు కొనసాగుతాయని డిప్యూటీ కమిషనర్ వెంకట రాములు స్పష్టం చేశారు. భవన నిర్మాణాలు తప్పనిసరిగా జీహెచ్‌ఎంసీ మంజూరు చేసిన అనుమతుల ప్రకారమే ఉండాలని, అదనపు అంతస్తులు, సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు, అక్రమ నిర్మాణాలు గుర్తిస్తే వెంటనే కూల్చివేతలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.

*ప్రత్యేక డ్రైవ్ కొనసాగింపు*

గాజులరామారం సర్కిల్‌లో అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఫిర్యాదులు, తనిఖీల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై వరుసగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు భవన నిర్మాణాలకు ముందు అవసరమైన అనుమతులు తీసుకుని, మంజూరైన ప్లాన్‌కు అనుగుణంగా మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

*అధికారుల సమక్షంలో డెమోలేషన్*

డెమోలేషన్ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ సుమిత్ర, టీపీఎస్ సరిత, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొని కూల్చివేత ప్రక్రియను పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాలపై భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో చర్యలు కొనసాగుతాయని టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!