📄 ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి !

సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి !

కంటైనర్‌ లారీని వెనుక నుంచి ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు

సూర్యాపేట, ఆగస్టు 26 (నవజ్యోతి ప్రతినిధి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బస్సులో 42 మంది.. 20 మందికి తీవ్ర గాయాలు

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి.. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సరైన, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు

బస్సు కంటైనర్‌ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాకపోకలకు అంతరాయం

ప్రమాదంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!