మాడుగులపల్లి, జూలై 28 (నువజ్యోతి ప్రతినిధి) ఇటీవల మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ యాదవ్‌ను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ యాదవ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పెద్ది కృపాకర్ గౌడ్, సర్నాల నాగరాజు, నన్నెబోయిన పార్వతమ్మ, రాయారపు ఉమారాణి, ఊర ప్రసన్న, బూర సరిత, నాగరాజు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

