📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పెళ్లయినా.. ఆస్తులు మాత్రం ఎవరివి వారివే!

పెళ్లయినా.. ఆస్తులు మాత్రం ఎవరివి వారివే!

లిస్బన్‌, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి): ప్రపంచ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, అతడి దీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగెజ్‌ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆగస్టు 11న పోర్చుగల్‌లోని కాస్కైస్‌లో అత్యంత ప్రైవేట్‌గా జరిగిన సివిల్‌ వివాహం ఇప్పుడు వారి ఆస్తుల వ్యవస్థ కారణంగా వార్తల్లో నిలిచింది.

‘సెపరేషన్‌ ఆఫ్‌ ప్రాపర్టీ’ అంటే?

వీరి వివాహంలో ‘సెపరేషన్‌ ఆఫ్‌ ప్రాపర్టీ’ విధానాన్ని ఎంచుకున్నట్లు వెల్లడైంది. అంటే భార్యాభర్తల ఆస్తులు సాధారణంగా వ్యక్తిగతంగానే కొనసాగుతాయి. పెళ్లికి ముందు ఉన్న ఆస్తులతో పాటు.. వివాహం తర్వాత వ్యక్తిగతంగా సంపాదించే లేదా కొనుగోలు చేసే ఆస్తులు కూడా ఆటోమేటిక్‌గా ఉమ్మడి ఆస్తులుగా మారవు.

సింపుల్‌గా చెప్పాలంటే..
రొనాల్డో ఆస్తులు, వ్యాపారాలు, పెట్టుబడులు ఒకవైపు.. జార్జినా ఆస్తులు, ఆదాయాలు మరోవైపు వ్యక్తిగత యాజమాన్యంలోనే ఉండేలా ఈ విధానం పనిచేస్తుంది.

భారీ సంపద నేపథ్యంలో ఆసక్తి

రొనాల్డో ఫుట్‌బాల్‌ జీతాలు, ప్రకటనలు, వ్యాపారాలు, పెట్టుబడులతో భారీ సంపదను కలిగి ఉన్నారు. జార్జినా కూడా మోడల్‌, వ్యాపారవేత్తగా తనకంటూ ఆదాయ వనరులను ఏర్పరుచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరూ ఆస్తుల విషయంలో ప్రత్యేకమైన వివాహ విధానాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

పదేళ్ల ప్రేమకు పెళ్లితో ముద్ర

రొనాల్డో–జార్జినా దాదాపు పదేళ్లుగా కలిసి ఉన్నారు. 2025 ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత 2026 ఆగస్టు 11న పోర్చుగల్‌లోని కాస్కైస్‌లో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

‘ఆస్తులు వేరు’ అంటే విడిపోతున్నారన్నది కాదు

సెపరేషన్‌ ఆఫ్‌ ప్రాపర్టీ విధానాన్ని ఎంచుకోవడం విడాకులకు ముందస్తు ఏర్పాటుగా భావించాల్సిన అవసరం లేదు. ఇది వివాహంలో ఆస్తుల యాజమాన్యాన్ని ఎలా నిర్వహించాలనే విషయానికి సంబంధించిన చట్టపరమైన విధానం మాత్రమే.

ప్రేమకు పెళ్లితో ముద్ర.. సంపదకు మాత్రం ఎవరి లెక్కలు వారివే!

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!