80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా అదిలాబాద్ లో నిర్వహించారు
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అదిలాబాద్, 15 ఆగస్టు (నవజ్యోతి ప్రతినిధి):
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా అదిలాబాద్ లో నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రసంగం అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రభుత్వ సలహాదారు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు కలిసి విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. పోలీస్ శాఖ నిర్వహించిన ఆకర్షణీయ పరేడ్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, ఏ ఎస్పీలు మౌనిక, రుత్విక్ సాయి కోటే, డి ఎఫ్ వో చిన్న విశ్వనాధ్ భూసా రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్ రావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

