కార్యక్రమం మధ్యలో అస్వస్థత.. వైద్యుల పరీక్షల అనంతరం హైదరాబాద్‌కు పయనం
ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి):
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. శనివారం కాకినాడలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాజమహేంద్రవరం చేరుకున్న ఆయన.. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ప్రారంభించారు. అయితే కార్యక్రమం జరుగుతుండగానే జ్వరం తీవ్రం కావడంతో పర్యటనను మధ్యలోనే ముగించారు.
వైద్యుల పరీక్షలు
రాజమహేంద్రవరంలో వైద్యుల బృందం పవన్ కల్యాణ్‌ను పరీక్షించి చికిత్స అందించింది. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు. జ్వరం కారణంగా విజయవాడ లోక్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు ఆయన కార్యాలయం అధికారులకు సమాచారం ఇచ్చింది.
విశ్రాంతి, ఫిజియోథెరపీపై దృష్టి
ఇటీవల పవన్ కల్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో.. వైద్యుల సూచనల మేరకు తదుపరి ఫిజియోథెరపీ, విశ్రాంతిపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

