📄 ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇమాంపూర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు !

ఇమాంపూర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు !

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ బక్క స్వరూప నవీన్ గౌడ్

తూప్రాన్, 15 ఆగష్టు (నవజ్యోతి ప్రతినిధి నవీన్):

తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా శనివారం ఇమాంపూర్ గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ బక్క స్వరూప నవీన్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామంలోని ప్రభుత్వ స్కూల్, పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఈ సందర్భంగా సర్పంచ్ బక్క స్వరూప నవీన్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పాలకవర్గం, గ్రామ పెద్దల సమన్వయంతో పని చేస్తామని సూచించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామస్తులను భాగస్వాములను చేస్తూ ప్రభుత్వ పథకాలను మరింత చేరువ చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

పంచాయతీ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు

అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆసరాగా ఉండేందుకు సర్పంచ్ బక్క స్వరూప నవీన్ గౌడ్ ప్రత్యేక చొరవతో హెల్త్ ఇన్సూరెన్స్ చేపించి సిబ్బందికి కార్డులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగేష్, పాలకవర్గం సభ్యులు, మాజీ సర్పంచ్ ఎల్లం, మాజీ ఉప సర్పంచ్ బక్క సత్యనారాయణ గౌడ్, జనార్దన్, పంచాయతీ కార్యదర్శి లావణ్య, గ్రామ పెద్దలు నాయకులు, గ్రామస్తులు, మహిళ సంఘాల సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!