📄 ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఇనార్బిట్ మాల్‌ వద్ద ఎండీఎంఏ విక్రయం.. ఐటీ ఉద్యోగి అరెస్ట్ !

ఇనార్బిట్ మాల్‌ వద్ద ఎండీఎంఏ విక్రయం.. ఐటీ ఉద్యోగి అరెస్ట్ !

7 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం.. మరో ముగ్గురి కోసం గాలింపు

హైదరాబాద్, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి):
మాదాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నాడన్న ఆరోపణలపై 23 ఏళ్ల ఐటీ ఉద్యోగి
షేక్ అమన్ అహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇనార్బిట్ మాల్‌
సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 7 గ్రాముల ఎండీఎంఏను
స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.లక్షగా అంచనా వేశారు. అతడి వద్ద నుంచి
మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయం

అమన్ అహ్మద్ ప్రధానంగా ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఎండీఎంఏ విక్రయించేవాడని
పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు,
ఎవరెవరికి సరఫరా చేశాడు అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మరో ముగ్గురు పరారీ

ఈ వ్యవహారంలో అమీర్ – రహీల్ అనే ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు
మధు అనే వినియోగదారు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వారి కోసం గాలింపు చేపట్టారు. డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలను
పోలీసులు సేకరిస్తున్నారు.

ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు

అమన్ అహ్మద్‌పై మాదాపూర్ పోలీసులు ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మూలం, నిందితుడికి
సరఫరా చేసిన వ్యక్తులు, విక్రయాల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు కొనసాగుతుంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!