📄 ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కిసాన్‌ మోర్చా కార్యవర్గ సభ్యునిగా పట్లోరి శ్రీనివాస్‌రెడ్డి !

కిసాన్‌ మోర్చా కార్యవర్గ సభ్యునిగా పట్లోరి శ్రీనివాస్‌రెడ్డి !

శాలువాతో ఘనంగా సన్మానించిన బీజేపీ నాయకులు

తూప్రాన్, 22 ఆగస్టు (నవజ్యోతి ప్రతినిధి):

సిద్దిపేట జిల్లా బీజేపీ కిసాన్‌ మోర్చా కార్యవర్గ సభ్యునిగా నియమితులైన
పట్లోరి శ్రీనివాస్‌రెడ్డిని బీజేపీ నాయకులు కలిసి
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.

🌾 నాయకుల అభినందనలు

జిల్లా జనరల్‌ సెక్రటరీ నత్తి మల్లేష్‌ ముదిరాజ్‌,
తూప్రాన్‌ మండల పార్టీ అధ్యక్షుడు పిట్ల పోచయ్య,
పట్టణ మున్సిపల్‌ అధ్యక్షుడు జానకిరామ్,
శక్తికేంద్రం ఇన్‌చార్జ్‌ కుంట రాజు,
జనరల్‌ సెక్రటరీ సందీప్, మనోహరాబాద్‌ జనరల్‌ సెక్రటరీ
మల్లేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు
నిరుడు యాదగిరి తదితరులు శ్రీనివాస్‌రెడ్డిని
కలిసి సన్మానించారు.

🚩 పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పార్టీ విస్తృత ప్రచారంలో ప్రతి ఒక్కరూ
భాగస్వాములై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అప్పగించిన
బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

పట్లోరి శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు
కిసాన్‌ మోర్చా బలోపేతానికి కృషి చేయాలని నాయకుల ఆకాంక్ష
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!