📄 ePaper
Monday, September 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కల్వర్టుకు రక్షణేదీ?.. అధికారుల పర్యవేక్షణేదీ?

కల్వర్టుకు రక్షణేదీ?.. అధికారుల పర్యవేక్షణేదీ?

ఒక్క అడుగు తప్పితే.. అంతే సంగతులు!

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి): జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి దూలపల్లి వెళ్లే రహదారిలో నరేంద్ర స్టీల్స్ ఫేజ్-1, ప్లాట్ నంబర్ 18/1 సమీపంలోని కల్వర్టు వద్ద సరైన రక్షణ గోడ లేకపోవడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాలు, కార్లు – ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంత రద్దీగా ఉండే రహదారిలో కల్వర్టు వద్ద భద్రతా ఏర్పాట్లు లేకపోవడం అధికారుల క్షేత్రస్థాయి పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

వర్షాకాలంలో రహదారి తడిగా ఉండటం, రాత్రివేళ దృశ్యమానత తగ్గడం వంటి పరిస్థితుల్లో రక్షణ గోడ లేని కల్వర్టు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు చేపట్టడం కంటే ముందుగానే ముప్పును గుర్తించి నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

అధికారుల పరిశీలనకు ఇదే సమయం

కల్వర్టు వద్ద పటిష్టమైన రక్షణ గోడ ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక సూచికలు – రాత్రివేళ వాహనదారులకు స్పష్టంగా కనిపించే భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!