📄 ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కశ్మీరీ పండిట్లకు మళ్లీ ఉగ్ర ముప్పు!

కశ్మీరీ పండిట్లకు మళ్లీ ఉగ్ర ముప్పు!

యూఎల్‌సీ బెదిరింపు లేఖతో భద్రత కట్టుదిట్టం.. ఆగస్టు 20 వరకు ఇళ్ల నుంచే విధులు

శ్రీనగర్‌, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): కశ్మీర్‌ లోయలో నివసిస్తున్న కశ్మీరీ పండిట్లకు ఉగ్ర ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. లష్కర్‌-ఎ-తయిబాతో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న యునైటెడ్‌ లిబరేషన్‌ కౌన్సిల్‌ (యూఎల్‌సీ) పేరుతో వెలువడిన ఓ బెదిరింపు లేఖలో కశ్మీరీ పండిట్‌ ఉద్యోగుల పేర్లు, ఫోన్‌ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లేఖ నిజస్వరూపం, దాని వెనుక ఉన్న వ్యక్తులపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

బెదిరింపు లేఖ వెలుగులోకి రావడంతో పండిట్లు నివసించే ప్రాంతాల్లో పోలీసు నిఘాను పెంచారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు భద్రతా చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. లోయలో పనిచేస్తున్న కశ్మీరీ పండిట్‌ ఉద్యోగులను కొంతకాలం కార్యాలయాలకు వెళ్లకుండా ఇళ్ల నుంచే విధులు నిర్వహించాలని సూచించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

ఆగస్టు 20 వరకు ఇళ్ల నుంచే విధులు

బెదిరింపు నేపథ్యంలో పండిట్‌ ఉద్యోగులకు ఆగస్టు 20 వరకు కార్యాలయాలకు హాజరు కాకుండా ఉండాలని సూచించినట్లు సమాచారం. సుమారు 2,800 మంది కశ్మీరీ పండిట్‌ సిబ్బందిపై ఈ ముందస్తు భద్రతా చర్యలు ప్రభావం చూపుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

లేఖ నిజమేనా?

ఇటీవల లోయలో వలస కార్మికులపై జరిగిన హత్యల నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ వెలుగులోకి రావడం మరింత ఆందోళనకు దారితీసింది. అయితే బెదిరింపు లేఖ నిజమైనదా? దాన్ని ఎవరు విడుదల చేశారు? అందులో పేర్కొన్న వ్యక్తులకు వాస్తవంగా ముప్పు ఉందా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

భద్రతా సంస్థలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో, ఎలాంటి అనుమానాస్పద సమాచారం కనిపించినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కశ్మీరీ పండిట్లకు సూచించినట్లు సమాచారం

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!