కామారెడ్డిలో జెండా ఆవిష్కరణ.. భిక్కనూరులో రోగులకు పండ్ల పంపిణీ..
కామారెడ్డి, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):
యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డిలో జిల్లా, అసెంబ్లీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యువత ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువతను పార్టీ బలోపేతంలో భాగస్వాములను చేయాలని అన్నారు.
కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, భిక్కనూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, బీబీపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్, కామారెడ్డి టౌన్ అధ్యక్షుడు అజ్మత్, పాల్వంచ అధ్యక్షుడు సమరసింహారెడ్డి, మాచారెడ్డి మండల అధ్యక్షుడు రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భిక్కనూరు మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ సేవా భావంతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవడం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. పేదలు, రోగులు, ఆపదలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు జీవన్, కర్నల శ్రీను, చిరంజీవి, ప్రదీప్, శశి, వంశీ, కిషన్, గంగాధర్, షారూక్, చక్రపాణి, సోహెల్, అశోక్, స్వామి, శ్రీకాంత్, లోకేష్, నిఖిల్, ప్రణయ్, అభిషేక్, బాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

