పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి చాటాలి.. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 21 (నవజ్యోతి ప్రతినిధి):
డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న
‘తెలంగాణ రైజింగ్–ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ను ప్రతిష్టాత్మకంగా
నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సమ్మిట్‌కు వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సీఎస్ సూచించారు.
ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో పాటు దేశంలోని వివిధ రంగాలకు చెందిన
ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
ప్రపంచ పెట్టుబడిదారులకు తెలంగాణ అవకాశాలు
శాస్త్ర–సాంకేతిక, వైద్య, విద్య, మౌలిక వసతులు తదితర రంగాల్లోని ప్రముఖులను ముందుగానే గుర్తించి
సమ్మిట్‌కు ఆహ్వానించాలని సీఎస్ సూచించారు. తెలంగాణలోని వివిధ రంగాల సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలను
ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రత్యేక ఎక్స్‌పోలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ప్రముఖ కంపెనీలు, సంస్థలు ఈ ఎక్స్పోల్లో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక కమిటీలు.. సలహా మండలి
సమ్మిట్ నిర్వహణ కోసం అవసరమైన వివిధ కమిటీలను ఏర్పాటు చేసి, ప్రతి కమిటీకి స్పష్టమైన బాధ్యతలు
అప్పగించాలని సీఎస్ సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణులతో
సలహా మండలి (అడ్వైజరీ కౌన్సిల్) ఏర్పాటు చేసి సమ్మిట్ నిర్వహణకు
మార్గదర్శకత్వం తీసుకోవాలని సూచించారు.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్వహణ
తెలంగాణను ప్రపంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మరింతగా నిలబెట్టేలా సమ్మిట్‌ను
అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించాలని సంజయ్ జాజు స్పష్టం చేశారు.
ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రపంచ పెట్టుబడుల చూపు తెలంగాణ వైపు మళ్లేలా..
‘ఇన్వెస్ట్ తెలంగాణ’ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి
సమీక్ష సమావేశంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్
శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య,
ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి,
ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి,
నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

