📄 ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వంటపాత్ర మూతలో 523 గ్రాముల బంగారం.. ప్రయాణికుడి అరెస్ట్‌ !

వంటపాత్ర మూతలో 523 గ్రాముల బంగారం.. ప్రయాణికుడి అరెస్ట్‌ !

రియాద్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికుడి బ్యాగేజీలో గుర్తింపు

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి):

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రియాద్‌ నుంచి ముంబై, అక్కడి నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు తనిఖీ చేశారు.

ప్రయాణికుడి చెక్‌-ఇన్‌ బ్యాగేజీలో ఎక్స్‌రే స్క్రీనింగ్‌ సందర్భంగా అనుమానాస్పద చిత్రాలు కనిపించడంతో
అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో వంటపాత్ర సెట్‌లోని ఓ మూతకు ఉన్న ఘనమైన భాగంలో
24 క్యారెట్ల బంగారాన్ని 15 ముక్కలుగా కట్‌ చేసి అక్రమంగా దాచినట్లు గుర్తించారు.
మొత్తం 523 గ్రాముల బంగారం (నికర బరువు) స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బంగారం:
24 క్యారెట్లు – 523 గ్రాములు
15 ముక్కలుగా కట్‌ చేసి వంటపాత్ర మూతలోని ఘన భాగంలో దాచినట్లు గుర్తింపు

ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరవేయాల్సి ఉందనే అంశాలపై విచారణ చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!