📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆహార భద్రత కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త !

ఆహార భద్రత కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త !

ఆగస్టు 31 వరకు ఇ-కేవైసీ వివరాల నమోదుకు గడువు పొడిగింపు • రేపటి నుంచి మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని ఆహార భద్రత (చౌక ధరల) కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. లబ్ధిదారుల వివరాల నమోదు (ఆధార్ అనుసంధానం) ప్రక్రియ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ నిర్ణయం హైదరాబాద్‌కే పరిమితమని ప్రచారం జరిగినప్పటికీ, తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆహార భద్రత కార్డుదారులకు ఈ గడువు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆగస్టు 1 నుంచి కార్డుదారులకు మరో వెసులుబాటు కల్పించారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దీంతో ప్రతి నెల రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.

లబ్ధిదారులు తప్పనిసరిగా చేయాల్సినవి

  • సమీపంలోని చౌక ధరల దుకాణంలో వివరాల నమోదు పూర్తి చేయాలి.
  • వేలిముద్ర లేదా కంటిపాప ధృవీకరణ ద్వారా నమోదు చేసుకోవాలి.
  • కుటుంబంలోని ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి సభ్యుడు అసలు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలి.
  • ఆగస్టు 31లోపు నమోదు పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

నిర్ణీత గడువులోగా వివరాల నమోదు పూర్తి చేయని పక్షంలో భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందువల్ల ప్రతి అర్హులైన కార్డుదారులు ఆలస్యం చేయకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!