📄 ePaper
Monday, September 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అదృశ్యమైన దివ్యపై యాసిడ్‌ దాడి.. మిస్టరీ!

అదృశ్యమైన దివ్యపై యాసిడ్‌ దాడి.. మిస్టరీ!

జంగంపల్లి వద్ద ప్రత్యక్షం.. కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు తరలింపు

బిక్కనూరు, సెప్టెంబర్ 13 (నవజ్యోతి ప్రతినిధి): సెప్టెంబర్ 11న అదృశ్యమైన భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన మధుసూదన్ కుమార్తె దివ్యవాణి రెండు రోజుల తర్వాత జంగంపల్లి వద్ద కనిపించడం, యాసిడ్ దాడికి గురైన స్థితిలో ఉండటంతో సంచలనం రేపింది. తీవ్ర గాయాలతో ఉన్న దివ్యవాణిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించి , అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

రెండు రోజుల్లో ఏం జరిగింది?

సెప్టెంబర్ 11న అదృశ్యమైన దివ్యవాణి.. 13వ తేదీ రాత్రి జంగంపల్లి వద్ద కనిపించే వరకు జరిగిన పరిణామాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆమెపై యాసిడ్ దాడి ఎవరు చేశారు? ఎక్కడ జరిగింది? దాడికి కారణమేంటి? అన్నది మిస్టరీగా మారింది.

టైమ్‌లైన్‌ చేధిస్తే.. మిస్టరీ వీడేనా?

సెప్టెంబర్ 11 నుంచి 13వ తేదీ రాత్రి వరకు గంగల్లి దివ్యవాణి కదలికలపై పూర్తి కాలక్రమాన్ని పోలీసులు చేధిస్తే ఘటన వెనుక అసలు నిజం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లో దివ్యవాణి ఎక్కడెక్కడికి వెళ్లింది? ఏయే ప్రాంతాల్లో ఆమె కదలికలు ఉన్నాయి? చివరకు జంగంపల్లి వద్దకు ఎలా చేరుకుంది? అనే అంశాలపై స్పష్టత వస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!