📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఒకరోజు రెమో.. ఒకరోజు అపరిచితుడు.. ఒకరోజు రామం!

ఒకరోజు రెమో.. ఒకరోజు అపరిచితుడు.. ఒకరోజు రామం!

అనుపమ పరమేశ్వరన్‌ సంచలన వ్యాఖ్యలు.. రెండేళ్ల బంధంపై తొలిసారి ఓపెన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
నటి అనుపమ పరమేశ్వరన్‌ తన గత బంధం గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో
చర్చనీయాంశంగా మారాయి. దాదాపు రెండేళ్లపాటు కొనసాగిన ఆ బంధంలో తన మాజీ భాగస్వామి
ఒక్కో రోజు ఒక్కోలా ప్రవర్తించేవాడని ఆమె వివరించారు.

ఒకరోజు రెమో.. మరోరోజు అపరిచితుడు!

“ఒకరోజు రెమోలా ప్రేమగా ఉంటాడు.. మరోరోజు అపరిచితుడిలా పూర్తిగా మారిపోతాడు..
ఇంకోరోజు రామంలా మారి క్షమాపణలు చెబుతూ ఏడుస్తాడు”
అంటూ అనుపమ తన అనుభవాన్ని
వివరించారు. ప్రేమ, నియంత్రణ, తీవ్ర ప్రవర్తన, ఆ తర్వాత పశ్చాత్తాపం, క్షమాపణలు.. ఇలా
పరిస్థితులు మారుతూ ఉండేవని ఆమె పేర్కొన్నారు.

“రెండేళ్లపాటు నా జీవితంలో జరిగిన అనుభవాలు నన్ను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రభావితం చేశాయి”
అనే భావనను అనుపమ తన వ్యాఖ్యల్లో వ్యక్తం చేశారు.

మూడు నెలల్లోనే నిశ్చితార్థం చర్చలు!

బంధం ప్రారంభమైన కొద్ది కాలానికే, అంటే దాదాపు మూడు నెలల్లోనే తన మాజీ
భాగస్వామి కుటుంబం నిశ్చితార్థం దిశగా అడుగులు వేసిందని అనుపమ వెల్లడించారు. అయితే
కాలక్రమంలో ఆ బంధం తన వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌పైనా ప్రభావం చూపిందని చెప్పారు.

సినిమాల విషయంలోనూ ఆంక్షలు?

సినిమా ప్రమోషన్లకు వెళ్లకుండా మాజీ భాగస్వామి తనను అడ్డుకునేవాడని అనుపమ ఆరోపించారు.
‘డ్రాగన్‌’ సినిమా ప్రమోషన్ల విషయంలోనూ ఆంక్షలు విధించాడని ఆమె పేర్కొన్నారు.
తన వృత్తిపరమైన నిర్ణయాలపై కూడా ఆ బంధం ప్రభావం చూపిందని వివరించారు.

ప్రేమతో మొదలై.. నియంత్రణ వరకు:
అనుపమ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రేమ, నియంత్రణ, తీవ్ర ప్రవర్తన, అనంతరం క్షమాపణలు
చెప్పడం వంటి పరిణామాలు ఆ బంధంలో చోటుచేసుకున్నాయి.

బయటపడిన వెంటనే మాట్లాడలేదు..

ఆ బంధం నుంచి బయటపడిన వెంటనే తాను అన్ని విషయాలను బయటకు చెప్పలేదని అనుపమ తెలిపారు.
తనను తాను కోలుకోవడానికి కొంత సమయం తీసుకున్నానని చెప్పారు. గతంలో సోషల్‌ మీడియాలో
కూడా స్వేచ్ఛ గురించి ఆమె చేసిన పోస్టులు అభిమానుల్లో చర్చకు దారితీశాయి.

తన జీవితంపై తానే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను తిరిగి పొందాననే భావనను ఆమె వ్యక్తం చేశారు.
భయం లేకుండా, ఎవరి అనుమతి అవసరం లేకుండా తన జీవితాన్ని తాను ఎంచుకోవాలని భావిస్తున్నట్లు
ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనూ వైరల్‌గా మారాయి.

ఇప్పుడు అసలు చర్చ ఇదే..
రెండేళ్ల బంధం తనను ఎంతగా ప్రభావితం చేసిందో అనుపమ తొలిసారి బహిరంగంగా వివరించడం
సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

అయితే అనుపమ తన వ్యాఖ్యల్లో మాజీ భాగస్వామి పేరును వెల్లడించలేదు. గతంలో ఆమె వ్యక్తిగత
జీవితంపై పలు రకాల వార్తలు, ఊహాగానాలు వచ్చినప్పటికీ.. తాజా వ్యాఖ్యల్లో ఆమె తన అనుభవం,
తనపై పడిన ప్రభావం గురించే మాట్లాడారు.

ప్రేమలో ఉన్నప్పుడు ఒక రూపం.. విడిపోవడానికి ముందు మరో రూపం..
ఇలా తనకు ఎదురైన అనుభవాలను అనుపమ వివరించడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!