📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణనల్గోండనూతన ఎస్‌ఐ సురేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ సర్పంచులు

నూతన ఎస్‌ఐ సురేష్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ సర్పంచులు

మాడుగులపల్లి, జూలై 28 (నువజ్యోతి ప్రతినిధి) ఇటీవల మాడుగులపల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ యాదవ్‌ను బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సురేష్ యాదవ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పెద్ది కృపాకర్ గౌడ్, సర్నాల నాగరాజు, నన్నెబోయిన పార్వతమ్మ, రాయారపు ఉమారాణి, ఊర ప్రసన్న, బూర సరిత, నాగరాజు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!