📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeసంగారెడ్డికలెక్టర్‌ను కలిసిన వీరశైవ సమాజం ప్రతినిధులు

కలెక్టర్‌ను కలిసిన వీరశైవ సమాజం ప్రతినిధులు

కాశీపూర్ వీరశైవ భవన్ భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వినతి

సంగారెడ్డి, జూలై 22 (నవజ్యోతి న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌లోని వీరశైవ భవన్‌కు చెందిన భూమి అన్యాక్రాంతానికి గురవుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరశైవ సమాజం ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

భూమికి సంబంధించిన సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధులు, వీరశైవ భవన్ స్థలాన్ని ఆక్రమణల నుంచి రక్షించి పరిరక్షించేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమస్యను సమగ్రంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలు, సలహాదారులు వెన్న చక్రేశ్వర్, అడివప్ప, కోశాధికారి సంతోష్ పాటిల్, సదాశివపేట శివకుమార్, పట్లోళ్ల నాగేశ్వర్ పాటిల్, నాగరాజు, శేఖర్, ప్రశాంత్, అభినయ్ కుమార్, కిరణ్ కుమార్, విద్యాసాగర్, భవాని, ప్రకాష్, నరేందర్, మహిళా ప్రతినిధులు అరుణ, శారద, వసంత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!