నల్లగొండ, జూలై 14 (నవజ్యోతి ప్రతినిధి)
నల్గొండ విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ గా అమరబోయిన శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ బీసీ సంఘ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ బీసీ సంఘ రాష్ట్ర నాయకులు మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ అమరబోయిన శ్రీనివాస్‌ను శాలువాతో సన్మానించి, నూతన బాధ్యతలలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ మాట్లాడుతూ, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రజలకు, రైతులకు, వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. విద్యుత్ సమస్యలపై తక్షణమే స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు విద్యుత్ అంతరాయాలను తగ్గించే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు, పశువులు, విద్యుత్ శాఖ సిబ్బందికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ బీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు గంజి వెంకన్న, జిల్లా కార్యదర్శి ఊటుకూరి గిరి, లైజాన్ ఆఫీసర్ మధు, ఏఏఓ కె.భిక్షపతి, జేఏవోవి. రవికుమార్, ఏడీఈ శంకరయ్య, జేఏవో హరి ప్రసాద్, జి. శ్రీనివాస్, ఏఈ ఎస్. హరికృష్ణ, ఏఇ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

