- షేక్ హుసేన్ కు రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిని
మాడుగులపల్లి, జులై 09 (నవజ్యోతి ప్రతినిధి) తోపుచర్ల గ్రామానికి చెందిన షేక్ హుసేన అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రభుత్వం మంజూరు చేసిన రూ.60 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ చెక్కును ఆయన అల్లుడు షేక్ మేరాజ్ పాషా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గౌని నిరంజన్, సీనియర్ నాయకుడు ఏరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, నాయకుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని నాయకులు తెలిపారు. ఆర్థిక సహాయం అందించినందుకు షేక్ హుసేన కుటుంబ సభ్యులు ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

