జిన్నారం, జూలై 8(నవజ్యోతి ప్రతినిధి):
- పిఆర్టియుటిఎస్ సంగారెడ్డి జిల్లా శాఖ ఆదేశాల మేరకు జిన్నారం మండలంలో 2026 సంవత్సరానికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మానయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, బొల్లారం హెచ్‌ఎం మంగీలాల్ హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
మొదటి రోజే ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్పందించి సభ్యత్వాన్ని స్వీకరించారు. “PRTU-TS సభ్యత్వం ఉపాధ్యాయులకు ఒక వరం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిన్నారం మండల అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి పవన్ రాజ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మొగులయ్య, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, త్రిశూల్‌నాథ్, చంద్రశేఖర్, బాబురావు, జిల్లా నాయకులు వెంకట్ రెడ్డి, రవీందర్, రవిరెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొదటి రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం జెడ్పీహెచ్‌ఎస్, పీఎస్ మాదారం, జెడ్పీహెచ్‌ఎస్ & పీఎస్ కొడకంచి, ఎంపీపీఎస్ పుట్టగూడ, జెడ్పీహెచ్‌ఎస్, పీఎస్, యూపీఎస్ శివానగర్, ఎంపీయూపీఎస్ అండూర్, ఊట్ల, ఎంపీపీఎస్ సోలక్‌పల్లి, ఇమామ్‌నగర్, దాదిగూడ, జెడ్పీహెచ్‌ఎస్ జిన్నారం, జెడ్పీహెచ్‌ఎస్ బొల్లారం, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల్లో విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం PRTU-TS ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రతి ఉపాధ్యాయుడు సంఘ సభ్యత్వం తీసుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగడంతో ఉపాధ్యాయులు సంఘ నాయకత్వాన్ని అభినందించారు.

