📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
HomeLifestyleఈవ్‌టీజింగ్‌పై కాయదు లోహర్ సంచలన వ్యాఖ్యలు

ఈవ్‌టీజింగ్‌పై కాయదు లోహర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, జూలై 2 (నవజ్యోతి ప్రతినిది) : దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యువ నటి కాయదు లోహర్ తన చిన్ననాటి చేదు అనుభవాన్ని పంచుకున్నారు. పదో తరగతి చదువుతున్న సమయంలో ఈవ్‌టీజింగ్‌కు గురయ్యానని, ఆ వేధింపులను తట్టుకోలేక ఓ యువకుడిపై రాయి విసిరానని వెల్లడించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కాయదు, ట్యూషన్‌కు వెళ్లే సమయంలో కొందరు యువకులు తరచూ వేధించేవారని తెలిపారు. మొదటి రెండు రోజులు మౌనంగా భరించినా, మూడో రోజు ఓ యువకుడు హద్దులు దాటడంతో తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు చెప్పారు. ఆ సమయంలో రోడ్డుపక్కన ఉన్న పెద్ద రాయిని తీసుకుని అతడి వైపు విసరగా, అది తలకు తగిలి గాయమైందని వివరించారు. ఆ సంఘటన తన జీవితంలో మరచిపోలేని అనుభవమని చెప్పారు.

తాను బయటకు చాలా సాఫ్ట్‌గా కనిపించినప్పటికీ, ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే గట్టిగా ఎదురు నిలబడతానని కాయదు పేర్కొన్నారు. అవసరమైతే మరోసారి కూడా అలాంటి వారిని ఎదిరిస్తానని స్పష్టం చేశారు.
కాయదు లోహర్ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న *‘ది ప్యారడైజ్’*తో పాటు పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!