రామాయంపేట,సెప్టెంబర్ 3 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
రామాయంపేట మండలం కిషన్‌తండా గ్రామపంచాయతీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా నోటీసులు వచ్చిన ఓటర్లకు సంబంధించి అధికారులు పరిశీలన చేపట్టారు. గ్రామంలో మొత్తం 147 నోటీసులు రాగా, 05 మంది ఓటర్లకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తికావాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రక్రియను ఆర్డీవో రమాదేవి, మండల తహసీల్దార్ రజినీకుమారి, ఆర్‌ఐ గోపి, జీపీఓ, బీఎల్‌ఓలు పర్యవేక్షించారు. నోటీసులు అందుకున్న వారు నిర్ణీత సమయంలో అవసరమైన వివరాలు, ఆధారాలతో అధికారులకు సమాధానాలు అందించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా SIR ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాణి–రాజు, ఉపసర్పంచ్ శోభ–లక్ష్మణ్, వార్డు సభ్యులు ఆత్మరాం, మోహన్, జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, బీఎల్‌ఓలు జాను చౌహాన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

