📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్‌ నేతపై హత్యాయత్నం కలకలం!

కాంగ్రెస్‌ నేతపై హత్యాయత్నం కలకలం!

అర్ధరాత్రి అలజడి.. కారుపై పెట్రోల్‌ పోసి నిప్పు!
కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 3 (నవజ్యోతి ప్రతినిధి):
బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జి.పి.ఆర్‌. లేఅవుట్‌లో
కాంగ్రెస్‌ నేత, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి సోదరుడు వీరారెడ్డిపై
హత్యాయత్నం జరిగినట్లు
సమాచారం కలకలం రేపింది. బుధవారం రాత్రి సుమారు
9.10 గంటల సమయంలో ఆయన కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన కారుపై గుర్తుతెలియని
వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
🔥 ఒక్కసారిగా మంటలు..
😱 కేకలు.. పరుగులు.. పరారైన దుండగులు!
రాత్రివేళ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి

🔥 మంటలు ఎగసిపడటంతో..

కార్యాలయం వద్ద నిలిపి ఉన్న కారులో మంటలు ఎగసిపడటాన్ని వీరారెడ్డి గమనించారు.
వెంటనే కేకలు వేయడంతో అక్కడి నుంచి దుండగులు పరుగులు తీసినట్లు తెలిసింది.
దీంతో పరిసరాల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.

🚔 రంగంలోకి దిగిన పోలీసులు

సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని
పరిశీలించారు. వివరాలు సేకరించిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ
దుండగుల కదలికలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
🔎 అసలు టార్గెట్‌ ఎవరు? కారణం ఏంటి?

ఇది సాధారణంగా కారుకు నిప్పంటించిన ఘటననా? లేక
వీరారెడ్డినే లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో చేసిన దాడా?
అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపార లావాదేవీల వివాదం ఏమైనా ఉందా?
పాత కక్షల కారణమా? ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

🚨 నిప్పు పెట్టింది ఎవరు?
🎯 టార్గెట్‌ ఎవరు?
🔥 దాడి వెనుక అసలు కారణమేంటి?
నిందితుల కోసం పోలీసుల గాలింపు.. సీసీ కెమెరాలే కీలక ఆధారం!
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది:
ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు, నిందితుల వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత
వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!