📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి చత్రపతి శివాజీ యువసేన చేయూత

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి చత్రపతి శివాజీ యువసేన చేయూత

రూ.1.04 లక్షల విరాళాలు సేకరించి కుటుంబానికి అందజేత

కమాన్‌పూర్‌, ఆగస్టు 31 (నవజ్యోతి జిల్లా ప్రతినిధి):
మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన బర్ల రమేష్‌ కుమార్తె మచ్చ సుమాంజలి–స్వామి దంపతుల నాలుగు నెలల కుమారుడు తీవ్ర మూర్ఛలతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు.

చిన్నారి చికిత్సకు సుమారు రూ.12 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపిన నేపథ్యంలో కుటుంబానికి ఆర్థిక సహాయం అవసరమైంది.

రూ.1.04 లక్షల సాయం

చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు మల్యాల శేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సభ్యులు విరాళాలు సేకరించారు. మొత్తం రూ.1,04,346 సేకరించి సోమవారం జూలపల్లిలో చిన్నారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఆపదలో అండగా..

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని నాయకులు అన్నారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో ఆపదలో ఉన్న వారికి తమవంతు సహాయం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు

కార్యక్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, చత్రపతి శివాజీ యువసేన వ్యవస్థాపకులు, సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!