విషాదంలో ఉన్న రెండు కుటుంబాలకు శేరి సుభాష్ రెడ్డి భరోసా
రామాయంపేట, ఆగస్టు 19 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
మానవత్వమే అసలైన రాజకీయమని చాటుతూ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి కాట్రియాల గ్రామంలోని విషాదంలో ఉన్న రెండు కుటుంబాలను పరామర్శించి అండగా నిలిచారు.
గ్రామానికి చెందిన కొత్త సుధాకర్‌రెడ్డి తల్లి శ్యామవ్వ, మైలారం వెంకటయ్య ఇటీవల మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న సుభాష్‌రెడ్డి బుధవారం గ్రామానికి చేరుకుని మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కష్టాలను తెలుసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వెంకటయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి, రెండు కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
కాట్రియాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆయన సేవలను గ్రామస్థులు, బీఆర్‌ఎస్ నాయకులు ప్రశంసించారు. పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడని మాజీ సర్పంచ్ మైలారం శ్యామ్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాబు,మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ బిల్లం సాయిరెడ్డి, తిరుపల్లి శ్రీశైలంరెడ్డి, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, శ్రీకాంత్ సాగర్, గ్రామ కమిటీ సభ్యులు,కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

