📄 ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రూపా రెడ్డి హత్య.. సంచలన విషయాలు !

నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రూపా రెడ్డి హత్య.. సంచలన విషయాలు !

ముసుగు జారడంతో గుర్తించిన ప్రిన్సిపాల్‌.. 27 సార్లు కత్తితో పొడిచి హత్య

నల్లగొండ, ఆగస్టు 19 (నవజ్యోతి ప్రతినిధి):

కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రూపా రెడ్డి హత్య కేసులో ఆమెకు గతంలో చదువు చెప్పిన
ఇద్దరు మైనర్‌ విద్యార్థులే నిందితులుగా పోలీసులు గుర్తించారు.
ఇంట్లో స్కూల్‌ ఫీజుల నగదు ఉంటుందని తెలుసుకున్న వారు ముందుగా రెక్కీ నిర్వహించి,
ముసుగులు ధరించి ఇంట్లోకి చొరబడ్డారని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు.

70 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన

కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సుమారు
70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు.
స్కూల్‌కు నాలుగు రోజుల సెలవుల అనంతరం గైర్హాజరైన 13 మంది విద్యార్థులను విచారించగా
ఇద్దరిపై అనుమానం వచ్చిందన్నారు.

నగదుపై రక్తపు మరకలు

ఒక నిందితుడి వద్ద లభించిన
రూ.1.54 లక్షల నగదుపై రక్తపు మరకలు గుర్తించి
ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపగా అవి రూపా రెడ్డి రక్తపు మరకలేనని నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.

హాస్టల్‌ నుంచి మార్చడంతో కక్ష

నిందితుల్లో ఒకరిని గతంలో హాస్టల్‌ నుంచి డే స్కాలర్‌గా మార్చినందుకు రూపా రెడ్డిపై
కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో
హత్యకు ఐదు రోజుల ముందు ఆమె ఇంటిపై రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

ముసుగు జారడంతో దారుణం

ఈ నెల 11న ఇద్దరు మైనర్లు ముసుగులు ధరించి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు.
వారిలో ఒకరి ముసుగు జారిపోవడంతో రూపా రెడ్డి అతడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో ఆమెపై
27 సార్లు కత్తితో దాడి చేసి హత్య చేసి,
ఫోన్‌, నగదుతో పరారైనట్లు వెల్లడించారు.

పోలీసుల స్వాధీనం:
రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్‌, రూపా రెడ్డి ఫోన్‌.
ఇద్దరూ మైనర్లు కావడంతో వారిని జువెనైల్‌ జస్టిస్‌ కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు ఎస్పీ తెలిపారు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!