📄 ePaper
Wednesday, August 19, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిపూడూరులో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

పూడూరులో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

మేడ్చల్, ఆగష్టు 18(నవజ్యోతి ప్రతినిధి )

మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు గ్రామంలో మంగళవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు నాయకులు భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్ల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. పూడూరు గ్రామంలోని అన్ని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి.

కృతజ్ఞతలు: నిధులు మంజూరు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, సింగరేణి పోచయ్య, బాబు యాదవ్, శేఖర్ రెడ్డి, నీరుడి రఘు, మానేపల్లి వెంకటేష్ మరియు గ్రామస్తులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!