సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖుల హాజరు
హైదరాబాద్, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి):
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో శనివారం ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రముఖుల హాజరు
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు.
గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకీ శుక్లా అతిథులకు స్వాగతం పలికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పర్వదినాల సందర్భంగా గవర్నర్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
రేవంత్‌రెడ్డి, రామచందర్‌రావు ఆత్మీయ పలకరింపు
కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు పరస్పరం ఆత్మీయంగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

