📄 ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గ్యాలంట్రీ మెడల్స్‌లో తెలుగు రాష్ట్రాల పోలీసుల సత్తా !

గ్యాలంట్రీ మెడల్స్‌లో తెలుగు రాష్ట్రాల పోలీసుల సత్తా !

38 మంది పోలీసులకు గ్యాలంట్రీ, విశిష్ట సేవ, మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు

హైదరాబాద్, ఆగస్టు 14 (నవజ్యోతి ప్రతినిధి):
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన 38 మంది పోలీసులకు గ్యాలంట్రీ, విశిష్ట సేవ, మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు లభించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 మంది, తెలంగాణకు చెందిన 15 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఏపీ నుంచి 23 మందికి పతకాలు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏడుగురికి గ్యాలంట్రీ మెడల్స్‌, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (PSM), 14 మందికి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌ (MSM) దక్కాయి.

గ్యాలంట్రీ మెడల్స్‌ పొందిన వారు

ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు కోరలాన మల్లేశ్‌, పైడి శ్రీరామమూర్తితో పాటు పోలీసు కానిస్టేబుళ్లు ఆదారి హేమసుందరరావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్‌, అబోతుల అప్పలనాయుడు, రూతల కన్నబాబు ఉన్నారు.

తెలంగాణ నుంచి 15 మందికి

తెలంగాణ నుంచి ముగ్గురికి గ్యాలంట్రీ మెడల్స్‌, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 10 మందికి మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌ లభించాయి.

గ్యాలంట్రీ మెడల్స్‌

ఇన్‌స్పెక్టర్‌ పి. జగదీశ్వర్‌, అదనపు డీసీపీ పి. వెంకట రమణ, డీఎస్పీ భూమన రవికుమార్‌రెడ్డి గ్యాలంట్రీ మెడల్స్‌ అందుకున్నారు.

విశిష్ట సేవా పతకాలు

అదనపు డీసీపీ నర్సయ్య జోగుల, ఎస్పీ ఆర్‌. జగదీశ్వర్‌రెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు పొందారు.

మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌

మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌ పొందిన వారిలో బాచలకూర రమేశ్‌, గంగారం ఆశాల, ఆర్‌.జి. శివమారుతి, సి. రాములు, డి. సత్యనారాయణ, కె. తిరుపతిరాజు, భూపతి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

ఫైర్‌, జైలు, హోంగార్డు విభాగాలకూ పతకాలు

రెండు రాష్ట్రాల్లోని అగ్నిమాపక, జైలు, హోంగార్డు విభాగాల సిబ్బందికి కూడా మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు లభించాయి.

దేశవ్యాప్తంగా.. 1,057 పతకాలు

పోలీసు, ఫైర్‌, హోంగార్డు, జైలు విభాగాలకు కలిపి దేశవ్యాప్తంగా
301 గ్యాలంట్రీ మెడల్స్‌,
92 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు,
664 మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌ ప్రకటించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రతిభ, ధైర్యసాహసాలు, విశిష్ట సేవలు అందించిన పోలీసు అధికారులు, సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం పతకాలతో గౌరవించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!