పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం.. 11 ఎకరాల ప్రభుత్వ భూమిలో నిర్మాణం..
హైదరాబాద్, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కోర్ అర్బన్ (CURE) ప్రాంత పరిధిలో ఇందిరమ్మ టవర్స్
నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
సుమారు 11 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిలో పేదల కోసం ఈ టవర్స్
నిర్మిస్తున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం
స్పష్టం చేశారు.
నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి
సంబంధించిన రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా రద్దు చేయాలని మంత్రులకు
సూచించారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్,
ఉప్పల్ తదితర ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు
చేపడుతోందన్నారు.
ఇదే సందర్భంగా నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూముల హక్కుదారులు
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములను
మినహాయించి మిగిలిన వాటికి బై-నంబర్లు ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తామని
తెలిపారు.
కూకట్పల్లి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి శ్రీధర్‌బాబును
సీఎం కోరారు. రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యాసంస్థలు, పరిశ్రమలు,
ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు.
పేదలకు గృహ వసతి కల్పించడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఉపాధి
అవకాశాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం పేర్కొన్నారు.

