📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హెచ్‌సీయూలో డ్రగ్స్‌ కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్‌!

హెచ్‌సీయూలో డ్రగ్స్‌ కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్‌!

ఆకస్మిక తనిఖీల్లో గంజాయి వ్యవహారం వెలుగులోకి.. పూర్వ విద్యార్థి అరెస్ట్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (నవజ్యోతి బ్యూరో చీఫ్‌ టి. రాజగోపాల్‌): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్‌ టీమ్‌ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గంజాయి వినియోగం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు నిర్వహించిన డ్రగ్‌ పరీక్షల్లో 17 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ఈగల్‌ టీమ్‌ అధికారులు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థిని ఒకరిని అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈగల్‌ టీమ్‌కు అందిన సమాచారంతో క్యాంపస్‌లో తనిఖీలు చేపట్టగా గంజాయి సరఫరా వ్యవహారం బయటపడినట్లు సమాచారం.

అస్సాం నుంచి గంజాయి సరఫరా

విచారణలో అస్సాం నుంచి గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అరెస్టైన పూర్వ విద్యార్థి నుంచి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

సరఫరా నెట్‌వర్క్‌పై ఆరా

డ్రగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన 17 మంది విద్యార్థుల నుంచి గంజాయి వినియోగానికి సంబంధించిన వివరాలను ఈగల్‌ టీమ్‌ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అస్సాం నుంచి గంజాయి సరఫరా వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

విద్యార్థుల్లో డ్రగ్స్‌ వినియోగాన్ని అరికట్టేందుకు ఈగల్‌ టీమ్‌ అధికారులు తనిఖీలు, నిఘాను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!